సప్తపది సాక్షిగా.....

 విడిపోవడం విజయం కాదు... బంధమే అసలు గెలుపు



విడిపోతే గెలిచినట్టు కాదు...
మారగలిగితేనే నిజమైన విజయం.

భార్య కోసం
భర్త తన లోపాలను సరిదిద్దుకుంటే...
అది అతని ఓటమి కాదు,
ప్రేమ గెలుపు.

భర్తలో తప్పులుంటే
వాటిని సరిచేసే ఓర్పు,
మాటతో మార్చే నేర్పు,
ప్రేమతో గెలిచే సత్తా చూపాలి.

అలాగే...
భార్యలో లోపాలుంటే
ఆమెను అర్థం చేసుకొని,
ఆమె చేయి విడవకుండా
తోడుగా నిలిచే హృదయం కూడా ఉండాలి.

చేయి పట్టుకోవడం సులభం...
చేయి వదిలేయడం ఇంకా సులభం...
కానీ చేయి వదలకుండా
జీవితాంతం నడిపించడమే
వివాహం నేర్పే గొప్ప పాఠం.

ప్రతి విభేదానికీ
విడాకులే పరిష్కారం అనుకుంటే,
తాళి విలువను
మనమే ఎగతాళి చేసినట్టవుతుంది.

తెగదెంపులు చేయడం ధైర్యం కాదు...
తెగిపోతున్న బంధాన్ని కుట్టి నిలబెట్టడమే ధైర్యం.

Comments