రోజుటి లాగే మా అమ్మాయి ఈ రోజు తన సాయంత్రపు స్నాక్స్ ఫోటో ఉత్సాహంగా మా మీ_మైన్ గ్రూపులో షేర్ చేసింది....
అది చూసిన నా మనసులో చిన్న అలజడి.....
ఫోటోలో పూరీలు నవ్వుతున్నాయి...
పచ్చని పానీ పిలుస్తోంది...
అమ్మాయికి కనిపించింది రుచి...
నాన్నకు కనిపించింది శుభ్రత!
"పానీ పూరీ దర్శనం".....
చిన్న చిన్న పూరీలు వరుసగా నిలబడి,
"మమ్మల్ని పగలగొట్టు!" అంటూ పోటీ పడుతున్నాయి.
పక్కనే బఠాణీ చాట్ గిన్నె నవ్వుతూ,
"నాలోనే అసలు రుచి దాగుంది!" అని గొప్పలు చెబుతోంది.
మరోవైపు పచ్చని పానీ గిన్నె మాత్రం,
అమాయకంగా మెరిసిపోతూ పిలుస్తోంది...
కానీ నాన్న మనసు మాత్రం మెల్లగా అడిగింది—
"రుచి బాగానే ఉంటుంది...
అది సరే...
ఆ నీళ్లు మాత్రం ఎక్కడి నుంచి వచ్చాయో?" 🤔😄
అమ్మాయి మాత్రం అప్పటికే
ఒక పూరీ... రెండు పూరీలు... ఐదు పూరీలు... ముగించింది!
తన నోట ఒక్కటే మాట—
"నాన్నా... సూపర్‌గా ఉంది!"
నాన్న మనసు మాత్రం ఇంకా అదే ప్రశ్నతో...
"సూపర్ రుచి కంటే...
సూపర్ శుభ్రత కూడా ఉంటే చాలు!"
Comments
Post a Comment